KTR Ponnala : పొన్నాలకు కేటీఆర్ ఆఫర్
బీఆర్ఎస్ లోకి ఆహ్వానం
KTR Ponnala : హైదరాబాద్ – టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వెళ్లడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని ప్రస్తుత పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
KTR Ponnala Offer Viral
తాను వీలైతే ఇవాళ పొన్నాల లక్ష్మయ్యను కలుస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపిస్తామని పేర్కొన్నారు. తమ పార్టీలోనే బీసీలకు, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్నారు కేటీఆర్.
శనివారం ట్విట్టర్ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. బహుజనులకు చెందిన పొన్నాలకు రాజకీయ పరంగా ఎంతో అనుభవం ఉందన్నారు. ఆయన అనుభవం తమ పార్టీకి మరింత పనికి వస్తుందన్నారు కేటీఆర్.
అందుకే పొన్నాల లక్ష్మయ్యను తమ పార్టీ లోకి రావాలని ఆహ్వానిస్తున్నామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇదిలా ఉండగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరడమే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు పొన్నాల లక్ష్మయ్య.
Also Read : Revanth Reddy : పొన్నాలకు అసలు సిగ్గుందా – రేవంత్