Tummala Nageswara Rao : రాహుల్ తో తుమ్మల భేటీ
కాంగ్రెస్ లో చేరాక తొలిసారి
Tummala Nageswara Rao : న్యూఢిల్లీ – మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం ఢిల్లీలో ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాహుల్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం రాహుల్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
Tummala Nageswara Rao Meet Rahul Gandhi
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao). ఆయన పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టికెట్ల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది.
ఈ తరుణంలో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. మరో వైపు ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ , ప్రముఖ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో ఇప్పుడు ఇదే సీటును పొంగులేటి కూడా ఆశిస్తున్నారు. దీంతో పార్టీ పరంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిలో ఎవరో ఒకరు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ తరుణంలో తుమ్మల నాగేశ్వర్ రావు హస్తినకు వెళ్లడం, రాహుల్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : KTR Ponnala : పొన్నాలకు కేటీఆర్ ఆఫర్