Revanth Reddy : సీట్లు అమ్ముకుంటున్న రేవంత్

పూడూరి జితేంద‌ర్ రెడ్డి కామెంట్స్

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో శాసన స‌భ ఎన్నిక‌లకు ముహూర్తం ఖ‌రారు కావ‌డంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయ‌తీ షురూ అయ్యింది. ప్ర‌త్యేకించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. పార్టీని వీడిన వారంతా మండిప‌డుతున్నారు.

Revanth Reddy Got Allegations

ఎల్బీ న‌గ‌ర్, ఉప్ప‌ల్ తో పాటు నాగ‌ర్ క‌ర్నూల్ సీటును అమ్ముకున్నాడంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. మ‌రో వైపు టీపీసీసీ సెక్ర‌ట‌రీ , రాష్ట్ర నాయ‌కుడు పూడూరి జితేంద‌ర్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఉప్ప‌ల్ లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. ఇక్క‌డ త‌న‌కు సీటు కేటాయించ లేదు ఏఐసీసీ సీఈసీ. త‌న‌తో పాటు మ‌రో 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనంత‌రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ‌ల్ల‌నే త‌న‌కు సీటు రాలేద‌ని ఆరోపించారు. టికెట్ల‌ను అమ్ముకుంటున్నాడంటూ ఆరోపించారు.

ఉప్ప‌ల్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ‌ను ద‌గ్ధం చేశారు. పార్టీలో జ‌వాబుదారీ త‌నం లేకుండా పోయింద‌న్నారు . పార్టీని నాశ‌నం చేస్తున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Akula Lalitha : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!