BSP Manifesto : బీఎస్పీ మేనిఫెస్టో విడుదల
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
BSP Manifesto : హైదరాబాద్ – తెలంగాణలో వచ్చే నెల నవంబర్ 30న శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. నవంబర్ 3న గెజిట్ రానుంది. 13 వరకు దరఖాస్తు చేసుకునేందుకు డెడ్ లైన్ విధించింది. దీంతో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఇవ్వగా బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ పార్టీ పరంగా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పాత వాటినే ఎక్కువగా జోడించారు.
BSP Manifesto Viral
మరో వైపు బహుజనుల గొంతుక వినిపిస్తున్న బీఎస్పీ(BSP) ఇవాళ పార్టీ పరంగా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఆపార్టీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని వారికి ఒక ఎకరం భూమి ఇస్తామన్నారు. మహిళా కార్మికులకు ఉచితంగా వాషింగ్ మెషీన్, ఉచితంగా స్మార్ట్ ఫోన్ , ఇల్లు లేని వారికి స్థలం, రూ. 6 లక్షల నగదు ఇస్తామన్నారు.
రూ. 5,000 కోట్లతో వలస కార్మికులకు వసతి సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందజేస్తామని తెలిపారు ఆర్ఎస్పీ. ప్రతి పంటకు మద్దతు ధర , ఏటా రూ. 25 వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్ ఉంటుందన్నారు.
జైభీం రక్షా కేంద్రాల కింద వృద్దులకు వసతి, ఆహారం, వైద్యం , యువతకు 10 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : Joe Biden : బైడెన్ ఇజ్రాయిల్ టూర్