AP CM YS Jagan Tour : 19న ఎమ్మిగనూరుకు జగన్
జగనన్న చేదోడు పథకం
AP CM YS Jagan Tour : ఎమ్మిగనూరు – కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 19న చేరుకుంటారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన జగనన్న చేదోడు పథకం కింద ఎంపిక చేసిన లబ్దిదారులకు నిధులు విడుదల చేస్తారు.
గురువారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి గూడెం నుంచి బయలు దేరుతారు ఏపీ సీఎం(AP CM YS Jagan). అక్కడి నుండి నేరుగా ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. నగరంలోని వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
AP CM YS Jagan Tour Updates
అక్కడే జనం సాక్షిగా కీలక ప్రసంగం చేస్తారు. అంతకు ముందు జగనన్న చేదోడు కింద ఎంపికైన లబ్దిదారులకు నిధులు విడుదల చేస్తారు. అక్కడి నుంచి కార్యక్రమం అనంతరం నేరుగా తిరిగి తాడేపల్లి గూడెం సీఎం కార్యాలయానికి చేరుకుంటారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాబోయే ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ స్టార్ట్ చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి తెలుసు కోవాలని ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఈసారి 175 సీట్లను స్వీప్ చేయాలని ఆదేశించారు జగన్ రెడ్డి. ఎవరు నిర్లక్ష్యం వహించినా తాను ఊరుకోనంటూ స్పష్టం చేశారు. దీంతో రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్దం చేయడం విశేషం.
Also Read : BSP Manifesto : బీఎస్పీ మేనిఫెస్టో విడుదల