TTD Security : శ్రీ‌వారి గ‌రుడ సేవ‌కు ట్రాఫిక్ మ‌ళ్లింపు

చిత్తూరు జిల్లా ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి

TTD Security : తిరుమ‌ల – తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో ట్రాఫిక్ స‌మ‌స్య ప్ర‌ధానంగా ఇబ్బందిగా మారింది. ఇదే స‌మ‌యంలో శ్రీ‌వారి గ‌రుడ సేవ గురువారం చేప‌ట్ట‌నుంది టీటీడీ(TTD).

ఆరోజు ఉద‌యం 6 గంట‌ల నుండి శుక్ర‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు అదే విధంగా తిరుమ‌ల నుండి తిరుప‌తికి ద్విచ‌క్ర వాహ‌నాల‌ను నిషేధించామ‌న్నారు ఎస్పీ. వాహ‌నదారులు అంతా కూడా తిరుప‌తిలో నిర్దేశించిన అలిపిరి బ‌స్టాండ్ , పాత చెక్ పాయింట్ , ఇష్కాన్ గ్రౌండ్ , మెడిక‌ల్ కాలేజీ గ్రౌండ్ , నెహ్రూ మున్సిప‌ల్ గ్రౌండ్ లలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు ఎస్పీ.

TTD Security Updates

గ‌రుడ సేవ రోజు వాహ‌న దారుల‌కు పాసులు ఇస్తామ‌న్నారు. చెన్నై నుండి వ‌చ్చే వాహ‌నాల‌కు వ‌డ‌మాల పేట టోల్ ప్లాజా వ‌ద్ద ఉన్న అగ‌స్త్య ఎన్ క్లేవ్ , తిరుచానూరు వ‌ద్ద ఉన్న మార్కెట్ యార్డులో ఇస్తామ‌న్నారు . క‌డ‌ప నుండి వ‌చ్చే వాహ‌నాల‌కు ఆంజనేయపురం దగ్గర గల ఆంజనేయ స్వామి గుడి సమీపమున ఉన్న రజస్థానీ/పంజాబీ దాబా, కరకంబాడి వద్ద ఉన్న ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాల లో ఇస్తామ‌ని తెలిపారు.

ఇక చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు చంద్రగిరి సమీపంలో ఉన్న ఐతే పల్లి, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్ , ఇక మ‌ద‌న‌ప‌ల్లి నుండి వచ్చే వాహనాలకు విధ్యా నికేతన్ కాలేజి సమీపంలో ఉన్న కే.ఎం.ఎం కాలేజ్, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్ లో ఇస్తామ‌ని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి నుండి వచ్చే వాహనాలకు రేణిగుంట సమీపంలో ఉన్న ఆర్ మల్లవరం పెట్రోల్ బంక్ వద్ద, తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు, కరకంబాడి వద్ద ఉన్న ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్తార‌ని తెలిపారు ఎస్పీ.

ఇక తిరుప‌తి నగరం, చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకు గరుడ సేవ రోజు ఉచిత పాస్ లు ఇచ్చు స్థలాలను ఎంపిక చేసిన‌ట్లు పేర్కొన్నారు. అలిపిరి పోలిస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ స్టేషన్, వెస్ట్ పోలీస్ స్టేషన్, .యస్.వి.యు పోలీస్ స్టేషన్, .తిరుచానూరు పోలీస్ స్టేషన్, శ్రీ‌నివాసం , .విష్ణునివాసం, .గోవిందరాజ స్వామీ సత్రాలు, .భూదేవి కాంప్లెక్స్ వద్ద టి.టి.డి వారు జారీ చేసే 4 వీలర్ పాసులు పొందాల‌ని సూచించారు.

Also Read : Pawan Kalyan : కార్యాచ‌ర‌ణ‌పై జ‌న‌సేనాని క‌స‌ర‌త్తు

Leave A Reply

Your Email Id will not be published!