KA Paul : కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్
నిప్పులు చెరిగిన కేఏ పాల్
KA Paul : హైదరాబాద్ – ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ముందుగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
KA Paul Slams Congress
అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ. దీంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బీఎస్పీ ఇవాళ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.
అన్ని పార్టీలు ప్రజలను మోసం చేయడంలో ముందంజలో ఉన్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో వీరికి చుక్కలు చూపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సంచలన ఆరోపణలు చేశారు.
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు కేఏ పాల్(KA Paul). ఈ దేశాన్ని , రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు కేఏ పాల్.
Also Read : Bathukamma : బతుకమ్మ ఆడిన ముస్లిం మహిళలు