Nagam Janardhan Reddy : జూపల్లి ఎలా గెలుస్తాడో చూస్తా
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
Nagam Janardhan Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి. కష్టపడి పని చేసిన నేతలను కాకుండా ఇతర పార్టీల నుండి జంప్ అయిన నేతలు 20 మందికి టికెట్లు ఇచ్చారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి టికెట్లను అమ్ముకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Nagam Janardhan Reddy Challenges
ఇదే సమయంలో కొల్లాపూర్ టికెట్ ను జగదీశ్వర్ రావుకు కాకుండా జూపల్లి కృష్ణా రావుకు కేటాయించడాన్ని తప్పు పట్టారు నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy). ఆరు నూరైనా సరే జూపల్లిని గెలవకుండా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. రాజకీయంగా తనను మట్టు పెట్టడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు మాజీ మంత్రి.
ముందు నుంచీ పార్టీ కోసం జగదీశ్వర్ రావు కష్టపడ్డారని అన్నారు. కానీ పారా చూట్ నాయకుడు జూపల్లికి టికెట్ ఇవ్వడం దారుణమన్నారు. జూపల్లిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. తనను కలిసిన జగదీశ్వర్ రావు అనుచరులను ఉద్దేశించి హామీ ఇచ్చారు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి.
Also Read : Rathod Bapu Rao : బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే గుడ్ బై