Supreme Court : సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం

స్వ‌లింగ పెళ్లిళ్ల‌పై కామెంట్స్

Supreme Court : న్యూఢిల్లీ – సేమ్ సెక్స్ అంశంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్. గ‌త కొంత కాలంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుదీర్ఘ విచార‌ణ‌లు జ‌రిగాయి. ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి. చివ‌ర‌కు ఇదే అంశం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌త్యేకించి స్వ‌లింగ వివాహాల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీజేఐ.

Supreme Court Decision

సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం ధ‌నంజయ వై చంద్ర‌చూడ్(Dhanunjaya Y Chandrachud) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ కు సంబంధించి చ‌ట్ట బ‌ద్ద‌త క‌ల్పించ‌లేమ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. మొత్తం ఈ కేసుపై జాతి యావ‌త్తు ఎలాంటి తీర్పు వ‌స్తుందోన‌ని ఉత్కంఠ‌తో ఎదురు చూశారు.

సేమ్ సెక్స్ ను ఇష్ట ప‌డుతున్న వాళ్లు, పిటిష‌న్లు దాఖ‌లు చేసిన వాళ్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి. ఈ మేర‌కు ఈ కేసుల‌కు సంబంధించి మొత్తం ఐదుగురుతో కూడిన ధ‌ర్మాస‌నం తీవ్ర స్థాయిలో సుదీర్ఘ చ‌ర్చ‌లు కొన‌సాగించింది.

ఇదిలా ఉండ‌గా సీజేఐగా చంద్ర‌చూడ్ కొలువు తీరిన త‌ర్వాత మోదీ స‌ర్కార్ తో నిత్యం ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ నెల‌కొంది. స్వ‌లింగ పెళ్లిళ్ల‌కు చ‌ట్ట బ‌ద్ద‌త క‌ల్పించ లేమంటూ సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. చివ‌ర‌కు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ విష‌యంలో అంతిమ నిర్ణ‌యం పార్ల‌మెంట్ తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు సీజేఐ .

Also Read : CEO Vikas Raj : ధైర్యంగా ఫిర్యాదు చేయండి – సిఇఓ

Leave A Reply

Your Email Id will not be published!