Telangana Congress : ఆడబిడ్డ చావును అవమానిస్తే ఎలా
మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ గుస్సా
Telangana Congress : హైదరాబాద్ – ప్రవళ్లిక చావును సైతం రాజకీయంగా వాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ(Telangana Congress). ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. నిత్యం చిలుక పలుకులు పలికే కేటీఆర్ వాస్తవాలు తెలుసు కోకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని సూచించింది.
Telangana Congress Slams KTR
ఆమె పరీక్షలు రాయలేదని, కేవలం ప్రేమ వ్యవహారమే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిందంటూ ఖాకీలు చెప్పడం దారుణమని వాపోయింది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని, దీనికి కల్వకుంట్ల కుటుంబం వత్తాసు పలుకుతోందంటూ ధ్వజమెత్తింది.
తెలంగాణ యువత భవిష్యత్తు ఆశలపై నీళ్లు చల్లిందని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని నమ్మ బలికిన చరిత్ర సీఎం కేసీఆర్ ది కాదా అని నిలదీసింది కాంగ్రెస్ పార్టీ. నిత్యం అబద్దాలు వల్లిస్తూ, ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రవళ్లిక విషయంలో మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిందని పేర్కొంది. యువతి సూసైడ్ పై అనుచిత కామెంట్స్ చేసిన మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది పార్టీ.
Also Read : Supreme Court : సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం