Jana Reddy : విజయం ఖాయం నేనే సీఎం – జానా
మాజీ మంత్రి సంచలన కామెంట్స్
Jana Reddy : హైదరాబాద్ – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కందూరు జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని , ఆ నమ్మకం తనకు ఉందన్నారు.
Jana Reddy Shocking Comments
పార్టీలో ఎందరు లీడర్లు ఉన్నా కాబోయే సీఎం తానేనని స్పష్టం చేశారు. ఆయన చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాను పదవుల రేసులో లేనని చెప్పారు. అయితే ఆయా పదవులన్నీ తనను వెతుక్కుంటూ వస్తాయని స్పష్టం చేశారు కందూరు జానా రెడ్డి(Jana Reddy).
గతంలో ప్రధాన మంత్రిగా ఎవరైనా పీవీ నరసింహా రావు అవుతారని అనుకున్నారా. కానీ ఒక్కోసారి పరిస్థితులు మనం కోరుకోకుండానే వరిస్తాయని గుర్తు చేశారు. సేమ్ సీన్ తెలంగాణ రాష్ట్రంలో ఎదురవుతుందని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కందూరు జానా రెడ్డి.
పదవులే తనను వెతుక్కుంటూ వస్తాయన్నారు. ముందు సీఎంను అవుతా. ఆ తర్వాత నా కొడుకును రాజీనామా చేయిస్తా..నేను నిలబడతా బంపర్ మెజారిటీ గెలుస్తానని జోష్యం చెప్పారు మాజీ మంత్రి.
Also Read : CM KCR Viral : సీఎం కేసీఆర్ హల్ చల్