Minister KTR : జన నీరాజనం సిరిసిల్లకు వందనం
ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్
Minister KTR : సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో వచ్చే నవంబర్ నెల 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
Minister KTR Comment
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దూకాయి. ఇక అన్ని పార్టీల కంటే ముందే భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎన్నికల శంఖారావం పూరించారు. వరుస బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్షాలను ఏకి పారేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో తాజాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ సభకు ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం తనయుడు , మంత్రి కేటీఆర్(Minister KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆశించిన దానికంటే హాజరై, ప్రభంజనం సృష్టించినందుకు తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్. దేశం యావత్తు ప్రస్తుతం తెలంగాణ వైపు చూస్తోందని, ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు .
Also Read : Jana Reddy : విజయం ఖాయం నేనే సీఎం – జానా