Minister KTR : ప్రవల్లిక కుటుంబాన్ని ఆదుకుంటాం
సభ సాక్షిగా ప్రకటించిన మంత్రి కేటీఆర్
Minister KTR : జాబ్ రాలేదని బెంగతో ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). ప్రవల్లిక తమ్ముడికి జాబ్ ఇస్తామని ప్రకటించారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని ఆరోపించారు.
Minister KTR Comment about Pravallika
తాను అన్న మాటలను వక్రీకరించారని, ప్రతిదీ రాజకీయం చేయాలని అనుకోవడం తనను బాధకు గురి చేసిందన్నారు. ఏది ఏమైనా ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం కొలువు తీరిన 10 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున జాబ్స్ ను ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. ప్రవల్లిక కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
Also Read : G Kishan Reddy : ప్లీజ్ బీజేపీకి మద్దతు ఇవ్వండి