Rahul Gandhi : ములుగు జిల్లా – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యాడని ఆరోపించారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ భేరి యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
Rahul Gandhi Slams KCR
రాష్ట్రాన్ని హామీల పేరుతో ఇంకా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చాడని మీకు ఇచ్చాడా అని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఉపాధి కల్పిస్తామని చెప్పిన సీఎం తమ వారికి పదవులు ఇప్పించు కోవడంలో సక్సెస్ అయ్యాడంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.
అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడుపుతామని కేసీఆర్ చెప్పాడని కానీ బీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్లు దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించారు రాహుల్ .
ధరణి పోర్టల్ స్కామ్ లో ప్రజలకు చెందిన భూములను పాలకులు లాక్కున్నారంటూ మండిపడ్డారు. ఇళ్లు కట్టిస్తానన్న సీఎం ప్రగతి భవన్ కట్టుకున్నాడని ధ్వజమెత్తారు ఎంపీ. కేసీఆర్ వల్ల తెలంగాణకు నష్టం తప్ప లాభం కలగలేదన్నారు.
Also Read : CM KCR : గులాబీ జెండా ఎగరడం ఖాయం