Indrakeeladri Temple : దుర్గమ్మ కోసం పోటెత్తిన భక్తజనం
ఇంద్రకీలాద్రి అంగరంగ వైభోగం
Indrakeeladri Temple : విజయవాడ – దసరా పండుగను పురస్కరించుకుని బెజవాడలో కొలువు తీరిన ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ ఆలయం(Kanaka Durga Temple) భక్తులతో నిండి పోయింది. నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. కనక దుర్గమ్మ పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టింది.
Indrakeeladri Temple Rush with Devotees
ఇదిలా ఉండగా మూలా నక్షత్రం, కనక దుర్గమ్మ జన్మ నక్షత్రం కావడంతో భక్తులు పోటెత్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారిని సరస్వతీ దేవి అలంకారంలో అలంకరించారు. దుర్గమ్మను దర్శించు కునేందుకు తండోప తండాలుగా భక్తులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున తరలి రావడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
నవరాత్రి ఉత్సవాలలో కనక దుర్గమ్మను దర్శించుకుంటే సకల రోగాలు పోతాయని, అష్టైశ్యర్యాలు కలుగుతాయని, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. మరో వైపు బెజవాడ లోని వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్డు దాకా భక్తులు బారులు తీరారు. ఎంతకూ తగ్గక పోవడంతో రోప్ లతో భక్తులను నియంత్రించేందుకు నానా తంటాలు పడుతున్నారు బెజవాడ ఖాకీలు.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు