Aswa Vahanam : క‌ల్కి అలంకారం మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

ప్ర‌త్యేక క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ

Aswa Vahanam : తిరుమ‌ల – తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎన‌మిదో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు.

Aswa Vahanam in Tirumala

ముందు గజ రాజులు రాజసంతో నడుస్తుండగా, భక్త జన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ(TTD) ముద్రించిన 6 పేజీల ప్రత్యేక క్యాలెండరును ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ.ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువ గల ఈ క్యాలెండరును 50 వేల కాపీలు టీటీడీ ముద్రించింది.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్త నాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవో వీర బ్ర‌హ్మం పాల్గొన్నారు.

Also Read : Akunuri Murali : ప్ర‌జ‌ల‌కు దొర‌క‌ని దొర కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!