Pawan Kalyan : రాధా పెళ్లిలో పవన్ సందడి
అంగ రంగ వైభవంగా వివాహం
Pawan Kalyan : విజయవాడ – జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ , మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. విజయవాడ తూర్పు నియజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగ వీటి రాధా కృష్ణ పెళ్లి పోరంకి లోని మురళి రిసార్ట్స్ లో అంగ రంగ వైభవంగా జరిగింది.
Pawan Kalyan Viral in Marriage Function
ఈ వేడుకకు స్వయంగా హాజరయ్యారు పవన్(Pawan Kalyan) , మనోహర్. నూతన వధూవరులైన వంగవీటి రాధా కృష్ణ, పుష్ప వల్లిలను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు, ప్రస్తుతం కేబినెట్ లో కొలువు తీరిన మంత్రులు, టీడీపీ సీనియర్ నాయకులు, ఆయా రంగాలకు చెందిన వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
వంగ వీటి రాధా కృష్ణ ఎవరో కాదు ఆయన వంగ వీటి రంగా తనయుడు. గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. వైసీపీలో జాయిన్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మధ్యన మాజీ మంత్రి కొడాలి నానితో కలవడం చర్చకు దారి తీసేలా చేసింది. మొత్తంగా వంగవీటి రాధా కృష్ణ ఓ ఇంటి వాడు కావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : BJP Ticket Row : తెలంగాణ బీజేపీలో టికెట్ల లొల్లి