Minister KTR : బీఆర్ఎస్ ఏ పార్టీకి బి టీం కాదు

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బి టీం కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రు ఎవ‌రితో క‌లిసి ఉంటున్నారో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని పేర్కొన్నారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో అన్ని స‌ర్వేలు గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాయ‌ని వెల్ల‌డించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Minister KTR Comment

దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. ఈ దేశంలోని రాజ‌కీయాల‌లో మోస్ట్ పాపుల‌రే కాదు అద్భుత‌మైన విజ‌న్ ఉన్న నాయ‌కుడు ఒకే ఒక్క‌డు తెలంగాణ సీఎం అని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడ‌ల్ గా మారింద‌న్నారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాల‌లో హైద‌రాబాద్ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌న్నారు. ఇవాళ దిగ్గ‌జ కంపెనీల‌న్నీ మ‌న రాష్ట్రం వైపు చూస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్.

రాష్ట్రంలో 119 సీట్ల‌కు గాను త‌మ పార్టీకి 100 సీట్లు సాధించ‌డం ప‌క్కా అని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. త‌మ‌ను ఎదుర్కొనే స‌త్తా ఏ పార్టీకి లేద‌న్నారు మంత్రి.

Also Read : LT Company : భారీ వ‌ర‌ద వ‌ల్లే మేడిగడ్డ స‌మ‌స్య

Leave A Reply

Your Email Id will not be published!