Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి యాత్ర షురూ
నిజం గెలవాలి పేరుతో పర్యటన
Nara Bhuvaneshwari : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన భార్య నారా భువనేశ్వరి బుధవారం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతకు ముందు ఆమె తిరుమలను సందర్శించారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
Nara Bhuvaneshwari Started Nijam Gelavali Program
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తట్టుకోలేక పలువురు గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆయా కుటుంబాలను స్వయంగా పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari). ఇందుకోసం పార్టీ నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రకు ప్లాన్ చేసింది. ఇది సక్సెస్ కావాలని కోరుతూ ఆమె పరామర్శించేందుకు బయలు దేరారు.
ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో రూ. 371 కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఇదంతా షెల్ కంపెనీల ద్వారా, హవాలా రూపంలో తిరిగి బాబు బొక్కసంలోకి చేరాయని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుతో పాటు మరో రెండు కేసులను బనాయించింది. వాటిలో ఒకటి ఫైబర్ నెట్ స్కాం కేసు, మరొకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం. ఇప్పటి వరకు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లకు దిక్కు లేకుండా పోయింది.
Also Read : Prakash Javadekar : సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి