Kodali Nani : నిజం గెలిచింది కాబట్టే బాబు జైల్లో
మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్
Kodali Nani : విజయవాడ – ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని అన్నారు. బాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపట్టడం దారుణమన్నారు.
Kodali Nani Shocking Comments on Chandrababu’s Wife
బుధవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తీవ్రంగా స్పందించారు. నిజం గెలిచింది కాబట్టే నారా చంద్రబాబు నాయడు జైలులో ఉన్నాడని, చిప్పకూడు తింటున్నాడంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani). ఒకవేళ నారా భువనేశ్వరి నిజం లేదా వాస్తవం గెలవాలని కోరుకుంటే ఇక జన్మలో చంద్రబాబు బయటకు రాడంటూ జోష్యం చెప్పారు.
నారా వారి కుటుంబమంతా అవినీతి సొమ్ములో కూరుకు పోయిందన్నారు. కుటుంబీకులు ఏ స్థాయిలో ఉన్నారో భువనేశ్వరి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు తెలుసన్నారు. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో, ఏం కష్టం చేస్తే దక్కాయో చెప్పాలని డిమాండ్ చేశారు కొడాలి నాని.
2 వేల ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం ఇవాళ 2 వేల కోట్లు ఎలా చేరుకుందో వివరించాలని కోరారు. జైలు లో ఉన్న బాబును బయటకు తీసుకు వచ్చేందుకు సుప్రీం లాయర్లకు రూ. 35 కోట్ల ఫీజులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెబితే సంతోషిస్తామని పేర్కొన్నారు కొడాలి నాని.
Also Read : Ambati Ram Babu : లోకేష్..ఏడిస్తే సింపతీ రాదు