Uttam Kumar Reddy : బీఆర్ఎస్ సర్కార్ పై ఈసీకి ఫిర్యాదు
రైతు బంధు నిలిపి వేయాలన్న కాంగ్రెస్
Uttam Kumar Reddy : న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసిందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయకూడదని అన్నారు.
Uttam Kumar Reddy Comments on BRS Party
కానీ బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలా చేయడం వల్ల ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ మేరకు తమ పార్టీ తరపున తాను కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు.
ఈసీని కలిసిన అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టకుని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను ప్రభావితం చేసేలా చర్యలు తీసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా ఆదేశించాలని ఎంపీ కోరారు.
Also Read : Satya Pal Malik : మోదీ సర్కార్ పై మాలిక్ కన్నెర్ర