Komatireddy Raj Gopal Reddy : ఛాన్స్ ఇస్తే కేసీఆర్ పై పోటీ చేస్తా
కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy : హైదరాబాద్ – మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారు. తిరిగి స్వంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో ఢిల్లీలోని ఏఐసీసీ పార్టీ కార్యాలయంలో హస్తం కండువా కప్పుకున్నారు.
Komatireddy Raj Gopal Reddy Comments Viral
గతంలో ఆయన మునుగోడుకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కోట్లాది రూపాయలు మునుగోడులో ఇరు పార్టీలు భారీ ఎత్తున ఖర్చు చేశాయి.
పోతూ పోతూ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. అబ్బే తాను అలా అనలేదంటూ పేర్కొన్నారు. కాషాయానికి రాం రాం చెప్పారు. పార్టీలో చేరిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆనాడు తాను రాజీనామా చేసినందుకే మునుగోడు అభివృద్ది చెందిందని చెప్పారు. లేక పోతే మండలం, రెవిన్యూ డివిజన్, 100 పడకల ఆస్పత్రి వచ్చేవి కావన్నారు. అంతే కాకుండా హైకమాండ్ ఆదేశిస్తే తాను గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీకి దిగేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి.
Also Read : CM KCR : ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటం