TTD JOBS 2023 : టీటీడీలో ప‌ర్మినెంట్ జాబ్స్

నోటిఫికేష‌న్ జారీ చేసిన టీటీడీ

TTD JOBS 2023 : తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది.

TTD JOBS 2023 Calender

ప‌ర్మినెంట్ బేసిస్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది టీటీడీ(TTD). ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఏఈఈ, ఏఈ, ఏటీవో జాబ్స్ భ‌ర్తీ చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఈ ఉద్యోగాల‌కు కేవ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ.

అంతే కాదు కేవ‌లం హిందువులై ఉండాల‌ని మిగ‌తా మ‌తాల‌కు చెందిన వారిని, అభ్య‌ర్థుల‌ను ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అనుమ‌తించే ప్ర‌స‌క్తి లేద‌ని పేర్కొంది. నవంబ‌ర్ 23వ తేదీ లోగా అప్లై చేసుకునేందుకు గ‌డువు ఇచ్చిన‌ట్లు తెలిపింది టీటీడీ.

ఉద్యోగాల ప‌రంగా చూస్తే మొత్తం 56 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ పోస్టులు (సివిల్ ) కు సంబంధించి 27 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా అసిస్టెంట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (టెక్నిక‌ల్ ) పోస్టులు 19 , అసిస్టెంట్ ఇంజ‌నీర్ (సివిల్ ) పోస్టులు 10 ఖాళీగా ఉన్నాయ‌ని తెలిపింది టీటీడీ.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు బీఈ, బీటెక్ లో సివిల్ , మెకానిక‌ల్ చేసిన వారు, ఎల్ సీఈ, ఎల్ఎంఈ డిప్లొమా సివిల్ ఇంజీరింగ్ విభాగాల్లో పాసై ఉండాలి. ఇక వ‌య‌సు ప‌రంగా చూస్తే 42 ఏళ్లు లోపు మాత్ర‌మే ఉండాల‌ని పేర్కొంది టీటీడీ. ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తున్న‌ట్లు తెలిపింది.

Also Read : TTD EO : టీటీడీలో ముఖ ఆధారిత హాజ‌రు స్టార్ట్

Leave A Reply

Your Email Id will not be published!