Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు ఎదుర్కొన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏఐసీసీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
Revanth Reddy Said Participate against KCR Area
ఇప్పటికే 119 సీట్లకు సంబంధించి మొత్తం అభ్యర్థులను ఖరారు చేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఈసారి అందరినీ ఆశ్చర్య పరుస్తూ రెండు చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో బరిలో ఉంటానంటూ స్పష్టం చేశారు.
దీంతో ఎలాగైనా సరే రెండు చోట్ల ఓడించాలని కంకణం కట్టుకున్నారు. విచిత్రం ఏమిటంటే 48 గంటల ముందు పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడుకు సీటు కేటాయించారు. దీనిపై తీవ్ర విమర్శలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వర్గంగా పేరు పొందిన నాయకులకు మొండి చేయి చూపింది ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ. ఇది బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. బల్మూర్ వెంకట్ , విష్ణు వర్దన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు. గద్దర్ కూతురు వెన్నెల కు టికెట్ కేటాయించింది పార్టీ.
Also Read : Mohammad Azharuddin : పంతం నెగ్గించుకున్న అజాహరుద్దీన్