Yanamala Ramakrishnudu : ఏపీ అప్పుల లెక్కలు తేల్చండి
బుగ్గనకు యనమల లేఖ
Yanamala Ramakrishnudu : అమరావతి – ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి లేఖ రాశారు. వెంటనే ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Yanamala Ramakrishnudu Asking Clarification
ఇదిలా ఉండగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాశానని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే తాను ఆర్థిక మంత్రికి వివరణ కోరుతూ లేఖ రాయడం జరిగిందని తెలిపారు యనమల రామకృష్ణుడు.
శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా తాను అడిగిన వివరాలు ఇవ్వాలని బుగ్గనను కోరానంటూ పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి కాగ్ ఇచ్చిన నివేదికని లేఖలో ప్రస్తావించారు. 67 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ సంస్థకు లెక్కలు ఇవ్వక పోవడంపై యనమల(Yanamala Ramakrishnudu) ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగ్ ఇచ్చిన నివేదిక ఏపీ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందన్నారు. ఐదేళ్లల్లో మేం 1.39 లక్షల కోట్ల మేర అప్పు చేస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తప్పు పట్టారని గుర్తు చేశారు. కానీ ఇవాళ తాను పవర్ లోకి వచ్చాక మూడింతల మేర రూ. 3.25 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.
Also Read : Nadendla Manohar : డ్రైవర్ పై దాడి దారుణం