Daggubati Purandeswari : కేంద్రం వల్లనే ఏపీ అభివృద్ది
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
Daggubati Purandeswari : తిరుపతి – కేంద్రం నిధులు మంజూరు చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది పనులను చేపట్ట గలుగుతోందని అన్నారు ఏపీ ఈజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. బుధవారం ఆమె తిరుపతిలో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఎన్నో నిధులను మంజూరు చేసిందని, కానీ ఇప్పటి వరకు ఏపీలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏ మాత్రం చెప్పడం లేదంటూ ఆరోపించారు.
Daggubati Purandeswari Comments on AP Govt
అందుకే తాము కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్ని, వీటి ద్వారా ఏపీలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియ చేసేందుకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి.
రూ. 1800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం రూ. 311 కోట్ల రూపాయలతో జరుగుతోందని తెలిపారు. రోజుకు 85 వేల మంది ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరబోతోందని ఆమె పేర్కొన్నారు.
ఐఐటి, ఐజర్ లాంటి విద్యా సంస్థల్లో ఒక్కో విద్య సంస్థకు 600 నుంచి 800 కోట్ల రూపాయలు అందించామని పురందేశ్వరి(Daggubati Purandeswari ) తెలిపారు. మెరుగైన ప్రమాణాలతో విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని, స్మార్ట్ సిటీగా తిరుపతిని మార్చేందుకు రూ. 1695 కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు.
Also Read : Vijayashanthi : దోపిడీకి చిరునామా తెలంగాణ