TPCC Chief : ఐటీ దాడులకు భయపడం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
TPCC Chief : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఐటీ, ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఇళ్లపై ఐటీ సోదాలు చేపట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించారు.
TPCC Chief Challenge
ఐటీ దాడులకు, మోదీ, బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భయపడ బోరంటూ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డి తప్పకుండా ఓడి పోతారని జోష్యం చెప్పారు.
ఆ విషయం బీఆర్ఎస్ పార్టీకి కూడా స్పష్టత వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. అందుకే కేంద్రం సహకారంతో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మోదీతో కలిసి ఐటీ చేత దాడులు చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్(TPCC Chief).
నరేంద్ర మోదీ , అమిత్ చంద్ర షా కలిసి కేసీఆర్ ను గెలిపించాలని అనుకున్నా తాము ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొడుతుందని స్పష్టం చేశారు.
Also Read : G Kishan Reddy : ఐటీ దాడులతో సంబంధం లేదు