Tammineni Veerabhadram : సీపీఎం ఒంటరి పోరాటం
తమ్మినేని వీరభద్రం స్పష్టం
Tammineni Veerabhadram : హైదరాబాద్ – తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించ లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram). ఆయన మీడియాతో మాట్లాడారు. తాము కోరిన సీట్లు ఇచ్చేందుకు మొదట అంగీకరించిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చిందని ఆరోపించారు. దీంతో తాము ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వీరభద్రం.
Tammineni Veerabhadram Comment
17 స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 స్థానాలలో సీపీఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో 6 స్థానాల్లో బరిలో ఉంటామని తెలిపారు సీపీఎం నేత.
ఈ మేరకు ఆయన పోటీ చేసే స్థానాలు ఏమిటనేది కూడా మీడియా ముఖంగా ప్రకటించారు. ఇందులో భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ , భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగాం, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ స్థానాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు తమ్మినేని వీరభద్రం.
ఏ స్థానాలు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామంటే కాంగ్రెస్ ను ఎలా నమ్మగలమని ప్రశ్నించారు . పదవుల కోసం పాకులాడే అవసరం తమకు ఎంత మాత్రం లేదన్నారు. ప్రధాని పదవినే వదులుకున్న చరిత్ర తమదన్నారు. రాష్ట్ర కమిటీ భేటీ అయ్యాక అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. సీపీఐ పోటీ చేసే చోట తాము నిలబడమన్నారు.
Also Read : Kasani Jnaneshwar : కారెక్కనున్న కాసాని