Minister Ramalinga Reddy : కరెంట్ కష్టాలు నిజమే
మంత్రి రామ లింగా రెడ్డి
Minister Ramalinga Reddy : కర్ణాటక – తెలంగాణలో కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుండి కర్ణాటకలో కొలువు తీరిన సర్కార్ కరెంట్ విషయంలో చేతులెత్తేయడం ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఆ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణలో పర్యటించారు. ఇదే సమయంలో కరెంట్ విషయంలో మాట తప్పారు.
Minister Ramalinga Reddy Shocking Comment
ప్రజలకు ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారు. ఐదు గ్యారెంటీ హామీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారు. చివరకు విద్యుత్ సరఫరా చేయడంలో చేతులెత్తేశారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్ విద్యుత్ సరఫరా లేక కొద్ది సేపు ఆగి పోయింది. ఇది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు ఇబ్బందిగా మారింది.
ఇది పక్కన పెడితే కరెంట్ సరఫరా విషయంపై చోటు చేసుకున్న ఇబ్బందుల గురించి ఆ పార్టీకి చెంది మంత్రి రామ లింగా రెడ్డి(Minister Ramalinga Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్యుత్ అంతరాయం అన్నది వాస్తవమేనని ఒప్పుకున్నారు. దీనికి కారణం సరైన వర్షాలు లేక పోవడమేనని పేర్కొన్నారు.
త్వరలోనే కరెంట్ కొనుగోలు చేస్తామని, మెరుగైన సరఫరా అందజేస్తామని స్పష్టం చేశారు రామ లింగారెడ్డి.
Also Read : Revanth Reddy : తెలంగాణ ఇవ్వడం వల్ల నష్టం