CM KCR : కాంగ్రెసోళ్లు సోయి లేనోళ్లు
తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR : మాయ మాటలు చెప్పడం, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ బాస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాలలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కేసీఆర్ బీజేపీని వదిలేసి కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.
CM KCR Slams Congress Candidates
కాంగ్రెసోళ్లకు సోయి అంటూ ఉండదన్నారు. ఎలాంటి విజన్ అన్నది లేకుండా కేవలం పదవులు, పంపకాలు తప్ప వారికి ఏ మాత్రం అవగాహన ఉండదంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు కేసీఆర్.
ఉత్తమ్ రైతు బంధు వద్దంటున్నాడని, ఇక రేవంత్ 3 గంటలు కరెంట్ చాలంటున్నారంటూ ఎద్దేవా చేశారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా లేక మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ సర్కార్ కావాలో మీరే తేల్చుకోవాలంటూ స్పష్టం చేశారు.
ఇప్పటికే కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ నేడో రేపో కూలిపోయే స్థితికి వచ్చిందన్నారు. అక్కడ కరెంట్ ఇవ్వలేనోళ్లు ఇక్కడికి వచ్చి నీతులు వల్లిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను దృష్టిలో పెట్టుకుని ఎద్దేవా చేశారు కేసీఆర్.
Also Read : YS Sharmila : మన్నించండి మద్దతు ఇవ్వండి