G Parameshwara : కన్నడ నాట సీఎం కుర్చీలాట
మద్దతు తెలిపిన మంత్రి రాజన్న
G Parameshwara : కర్ణాటక – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు ప్రజలు. అవినీతికి కేరాఫ్ గా మారి పోయిన భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించామని ఆనంద పడిన వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు హస్తం నేతలు.
G Parameshwara Comments Viral
హామీల పేరుతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లో ముందు నుంచీ సీఎం పదవిపై ఆధిపత్య పోరు నడిచింది. తొలుత సీఎం పోస్టు కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. చివరకు హైకమాండ్ రంగంలోకి దిగి పదవిని చెరో సగం రెండున్నర ఏళ్లు ఉండేలా ఒప్పందం కుదిర్చింది ఇద్దరి మధ్య.
ఇదే సమయంలో మొదట బాగానే ఉన్నా ఆ తర్వాత పార్టీలో లుక లుకలు మళ్లీ మొదలయ్యాయి. ఒక
రి తర్వాత మరొకరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దీనికి శ్రీకారం చుట్టింది సీఎం సిద్దరామయ్యనే. తాను పూర్తిగా 5 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ప్రకటించారు. దీనిపై డీకే వర్గీయులు తప్పు పట్టారు.
ఇదే సమయంలో ఏఐసీసీ చీఫ్ గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే తనయుడు ఐటీ మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే తాను కూడా సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే రెడీ అని తెలిపాడు. ఉన్నట్టుండి సహకార మంత్రిగా ఉన్న రాజన్న షాకింగ్ కామెంట్స్ చేశారు.
జి. పరమేశ్వరకు(G Parameshwara) సీఎం అయ్యే అవకాశం ఉందంటూ కుండ బద్దలు కొట్టారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు పార్టీ శ్రేణులు.
Also Read : Asaduddin Owaisi : రాహుల్ పై ఫైర్ అజ్జూకు షాక్