BRS JOBS : జాబ్స్ భర్తీలో తెలంగాణ నెంబర్ వన్
ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం
BRS JOBS : హైదరాబాద్ – తెలంగాణలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తను నియమించిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పింది. అయితే ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ , బీజేపీ , వైఎస్సార్ టీపీ, తదితర పార్టీలు ఉద్యోగాల విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించింది సర్కార్. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది.
BRS JOBS Updates
బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరిన ఈ తొమ్మిన్నర ఏళ్ల కాలంలో ఏకంగా 1,60,083 పోస్టులు నింపామని తెలిపింది. వీటికి అదనంగా మరో 70,000 పోస్టులు వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే 2,32,308 పోస్టులను నింపామని పేర్కొంది సర్కార్.
ఇక ప్రైవేట్ రంగంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 లక్షల ఉద్యోగాలు సృష్టించామని, రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందని వెల్లడించింది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం. ఒక్క ఐటీ సెక్టార్ లోనే 6 లక్షల కొత్త జాబ్స్ క్రియేట్ చేశామని తెలిపింది. మరో వైపుజనాభా ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు భర్తీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని స్పష్టం చేసింది.
Also Read : Minister KTR : కేసీఆర్ సింహం లాంటోడు – కేటీఆర్