BRS Win Again : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ మరో జాతీయ స్థాయి ఛానల్ జీ న్యూస్ , మ్యాట్రిజ్ తో కలిసి సర్వే చేపట్టింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోందని ప్రకటించింది. సర్వే వివరాలను వెల్లడించింది.
BRS Win Again Says Zee News Survey
రాష్ట్రంలో మొత్తం 119 సీట్లు ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీకి(BRS Party) 70 నుంచి 76 సీట్లు వస్తాయని, ఇక కాంగ్రెస్ పార్టీకి 27 నుంచి 33 సీట్లు దక్కుతాయని, భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 8 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఎంఐఎంకు 6 నుంచి 7 సీట్లు, ఇతరులు ఒకరు గెలుస్తారని తెలిపింది.
ఇక ఇప్పటి వరకు పలు సంస్థలు ముందస్తుగానే ప్రకటించాయి. కొన్ని తప్ప అన్నీ గంప గుత్తగా బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందంటూ పేర్కొన్నాయి. కానీ గ్రౌండ్ లెవల్లో ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి రాష్ట్రంలో పాలన గాడి తప్పడం, భూ కబ్జాలు, ధరణి పేరుతో దందాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఆగడాలు, దోపిడీకి కేరాఫ్ గా మారడం ఇవన్నీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒకింత బలాన్ని చేకూర్చేలా ఉండడం కూడా ఇబ్బందికరంగా మారింది. మరి ఏ రకంగా బీఆర్ఎస్ గెలుస్తుందో సర్వే చేపట్టిన జీ టీవీకే తెలియాలి.
Also Read : Tammineni Veerabhadram : కాంగ్రెస్ మోసం సీపీఎం ఆగ్రహం