Heeralal Samariya : కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ గా హీరాలాల్

రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ప్ర‌మాణ స్వీకారం

Heeralal Samariya : న్యూఢిల్లీ – సీజేఐ దెబ్బ‌కు కేంద్ర స‌ర్కార్ దిగొచ్చింది. గ‌డువుకు ముందు రోజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే స‌మాచార హ‌క్కు క‌మిష‌న్ చీఫ్ ప‌ద‌విని భ‌ర్తీ చేసింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ చీఫ్ గా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ హీరాలాల్ స‌మారియాను నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే పోస్టులో వైకే సిన్హా ఉన్నారు. అక్టోబ‌ర్ 3న ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా ఆ ప‌ద‌వి ఖాళీగా ఉంది.

Heeralal Samariya As a Chief Information Commissioner

ఇదిలా ఉండ‌గా సోమ‌వారం హుటా హుటిన రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో కేంద్ర స‌మాచార క‌మిష‌న్ (సీఈసీ) చీఫ్ గా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హీరాలాల్ స‌మారియాతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండ‌గా ఈ ప‌ద‌విలో ఉన్న తొలి ద‌ళిత ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు.

హీరాలాల్ స‌మారియా(Heeralal Samariya) కేంద్ర కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ‌లో కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. ప్ర‌జా సేవ‌కుడిగా గుర్తింపు పొందారు. స‌మాచార హ‌క్కు క‌మిష‌న్ 10 మంది క‌మిష‌న‌ర్లను క‌లిగి ఉంటుంది. అప్ప‌డు కేంద్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింది.

అయితే సీజేఏ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయ్యింది. ఖాళీగా ఉన్న క‌మిష‌న‌ర్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించింది.

Also Read : SCR Vijayawada Trains : విజ‌య‌వాడ రూట్ లో ప‌లు రైళ్లు ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!