Tummala Nageswara Rao : కేసీఆర్ కామెంట్స్ తుమ్మల సీరియస్
పువ్వాడ అజయ్ కుమార్ వాసన లేని పువ్వు
Tummala Nageswara Rao : ఖమ్మం – సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు తుమ్మల నాగేశ్వర్ రావు. అధికారం ఉంది కదా అని ఎలా అంటే అలా మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఎవరు ఎవరిని పదవి ఇవ్వాలని అడిగారో కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.
Tummala Nageswara Rao Serious on KCR
సోమవారం తుమ్మల నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ అజయ్ పూజకు పనికి రాని వయ్యారి భామ లాంటి పువ్వు అంటూ ఎద్దేవా చేశారు. తనను తుమ్మ చెట్టుతో పోల్చినందుకు తాను బాధ పడడం లేదన్నారు. తుమ్మ చెట్టు ముదిరితే నీళ్లు లేకుండా బితికి అరకగా రైతుకు ఉపయోగ పడుతుందని చెప్పారు.
కానీ 80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావికి ఈ విషయం తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao). ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాలుగు పార్టీలు మారిన ఆర్టీసీ మినిష్టర్ పువ్వాడ అజయ్ కుమార్ కు లేదన్నారు. ఎవరు ప్రజా క్షేత్రంలో ఉన్నారో , ఎవరు ప్రజల కోసం పని చేశారో ప్రజలకు తెలుసన్నారు.
కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వర్కవుట్ కాదంటూ ఎద్దేవా చేశారు తుమ్మల నాగేశ్వర్ రావు.
Also Read : AP CM YS Jagan : బస్సు ప్రమాదం విచారణకు ఆదేశం