AP CM YS Jagan : బస్సు ప్రమాదం విచారణకు ఆదేశం
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు
AP CM YS Jagan : అమరావతి – విజయవాడ బస్టాండ్ లో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. వెంటనే ఉన్నతాధికారులను హుటా హుటిన సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు ఎందుకు బస్సు ప్రమాదం జరిగిందనే దానిపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు సీఎం.
AP CM YS Jagan Respond on Bus Incident
ఇదిలా ఉండగా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంపై సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు ఉన్నతాధికారులు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరగలేదని , బ్రేక్ లు ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏమిటనేది తనకు తెలియాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును వెంటనే తన వద్దకు రావాలని ఆదేశించారు. మరణించిన వారికి వెంటనే పరిహారం అందజేయాలని, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
Also Read : Tummala Nageswara Rao : కేసీఆర్ కామెంట్స్ తుమ్మల సీరియస్