Congress Ticket : కాంగ్రెస్ లో పటాన్ చెరు లొల్లి
దామోదర వర్సెస్ జగ్గారెడ్డి
Congress Ticket : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్(Congress) లో టికెట్ల పంచాయతీ కొలిక్కి ఇంకా రాలేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రక్తి కట్టిస్తున్నారు. ప్రధానంగా పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించి టికెట్ వ్యవహారం ఇద్దరి సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేపింది.
Congress Ticket Issues
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి నీలం మధు ముదిరాజ్ కు టికెట్ ఇప్పించారనే ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో తన అనుచరుడికి టికెట్ రాకుండా చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది.
20 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ కు కాకుండా నీలం మధు ముదిరాజ్ కు ఎలా టికెట్ ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇదే విషయంపై తాను రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడే ప్రసక్తి లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దామోదర రాజ నరసింహ. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే రంగంలోకి దిగారు. ఆయన నేరుగా దామోదరకు ఫోన్ చేశారు. తొందరపాటు పడవద్దని సూచించారు. పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
ఇదిలా ఉండగా నీలం మధును మారిస్తే తాను ఊరుకోనంటూ హెచ్చరించారు. వీలైతే పార్టీని వీడేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ స్పష్టం చేశారు మరో వైపు ఎమ్మెల్యే జగ్గా రెడ్డి.
Also Read : BJP BC CM : ఓబీసీ సీఎం ఎన్నికల నినాదం