Ponguleti Srinivas Reddy : కేంద్ర సంస్థలు దాడి చేసే ఛాన్స్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్
Ponguleti Srinivas Reddy : ఖమ్మం – మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందంటూ పేర్కొన్నారు. అయినా తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Ponguleti Srinivas Reddy Comments Viral
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీకి రిజైన్ చేసి ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు.
బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో కేంద్రంలోని మోదీ సర్కార్ సాయంతో తనపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే అవకాశం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. అయినా ఎక్కడా వెనుదిరిగే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు.
అయినా ఎన్ని దాడులు చేసినా, ఇంకెన్ని సోదాలు జరిపినా రాష్ట్రంలో గులాబీ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ లేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, 75 సీట్లకు పైగా తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా మాజీ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Madhu Yashki Goud : సీఎం రేసులో నేనున్నా