Revanth Reddy : తెలంగాణ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెచ్చి పోయారు. కనీసం మీడియా పట్ల ఎలాంటి గౌరవం లేకుండా నోరు పారేసుకున్నారు. తాను తలుచుకుంటే మీడియాను తొక్కి పారేస్తానంటూ హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎవరో ఏదో అన్నారని, వాటన్నింటికీ తాను ఎలా జవాబు ఇస్తానంటూ మండిపడ్డారు. మీకు తోచింది వేసుకుంటూ, రాసుకుంటూ పోతే ఎలా చూస్తామంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Slams Media
మీడియా తమకు వ్యతిరేకంగా వ్యవహరించినా లేదా అదుపు తప్పి రాసినా ఊరుకునే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఏ మీడియాను ఆయన దూషించారో అదే మీడియా రేవంత్ రెడ్డికి(Revanth Reddy) ప్రచారం ఇస్తోందన్న సంగతి మరిచి పోవడం విడ్డూరంగగా ఉంది.
రేవంత్ రెడ్డి నోరు జారడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాలు. ప్రతి దానికి కొన్ని నియమాలంటూ ఉంటాయని, తను ఈ స్థాయికి రావడానికి కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఉపయోగ పడిందన్న విషయాన్ని గుర్తించక పోవడం దారుణమన్నారు. ఇకనైనా తన తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : Ponguleti Srinivas Reddy : కేంద్ర సంస్థలు దాడి చేసే ఛాన్స్