Revanth Reddy : కల్వకుంట్ల కాలకేయులు జైలుకే
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Reddy : ఉట్నూరు – ప్రజల తెలంగాణ కావాలా లేక దొరల తెలంగాణ కావాలో తేల్చు కోవాలని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revatj Reddy). బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉట్నూరు లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
బీఆర్ఎస్ నేతలు జాన్సన్ నాయక్ వంటి దొరల వైపు ఉన్నారని కాంగ్రెస్ నేతలు వెడ్మ బొజ్జు పటేల్ వంటి సామాన్యుడి వైపు ఉన్నారని ఎవరు కావాలో తేల్చు కోవాల్సింది మీరేనని అన్నారు. జాన్సన్ వద్ద కోట్ల రూపాయల సంపద ఉందని కానీ పటేల్ వద్ద ప్రజల ఓట్లు ఉన్నాయని చెప్పారు.
Revanth Reddy Comments on BRS Party
తెలంగాణ పేరు చెప్పి సంపద నంతా దోచుకున్న గజ దొంగలు కల్వకుంట్ల కాలకేయులంటూ సంచలన ఆరోపణలు చేశారు. వీరిని సాగనంపితే కానీ తెలంగాణ బాగు పడదన్నారు. దోపిడీ దొంగలు కావాలా లేక ప్రజలకు సేవలు చేసే నాయకులు కావాలా తేల్చు కోవాలన్నారు.
ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించాలని అన్నారు. ధరణి పేరుతో భూములు కొల్లగొట్టారని, ఇసుక పేరుతో కోట్లు సంపాదించారని మండిపడ్డారు. ఒక్క హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాలు గాయబ్ చేశారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి.
Also Read : Revanth Reddy : మీడియాను తొక్కి పడేస్తా