Seethakka MLA : కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా ములుగులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని కుండ బద్దలు కొట్టారు ఎమ్మెల్యే సీతక్క(Seethakka MLA). ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ములుగులో జరిగిన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అయినా ప్రజలు తన వైపు ఉన్నారని స్పష్టం చేశారు.
Seethakka MLA Comment
ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని అనుకుంటారో వారికే ఓటు వేయాలని అన్నారు. కరోనా కష్ట కాలంలో, వరదలు చుట్టు ముట్టినప్పుడు ఎవరు మీకు సేవలు అందించారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అన్నారు సీతక్క.
ముందు నుంచీ కేసీఆర్ కు తనంటే పడదన్నారు. ఎందుకంటే తాను ప్రజా సమస్యలను లేవనెత్తుతానని, కానీ ఆయనకు వంగి వంగి సలాం చేసే వాళ్లు కావాలన్నారు. తాను ఏనాడూ ఎవరిని దేబరించ లేదన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా ఎగిరేది ములుగులో కాంగ్రెస్ పార్టీ జెండానేనని అన్నారు. పోడు భూముల గురించి నిలదీశానని, తనకు ఎదురే లేకుండా , ప్రశ్నించకుండా ఉండేందుకు తనను ఓడించాలని ప్లాన్ చేస్తున్నారంటూ ఆరోపించారు. దోచు కోవడం దానిని దాచు కోవడమే బీఆర్ఎస్ పార్టీ పని అంటూ నిప్పులు చెరిగారు.
Also Read : Harish Rao : మైనంపల్లి పరాజయం ఖాయం