Daggubati Purandeswari : కేంద్రం వల్లనే ఏపీ అభివృద్ది
బీజేపీ చీఫ్ పురందేశ్వరి
Daggubati Purandeswari : అమరావతి – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ తోడ్పాటు వల్లనే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.
Daggubati Purandeswari Slams Jagan Ruling
తమ సర్కార్ దేశంలో అవినీతి లేని పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచిందన్నారు. ఆర్థిక పరంగా 3వ స్థానానికి తీసుకు వచ్చిన ఘనత తమ పీఎంకే దక్కుతుందన్నారు పురందేశ్వరి(Daggubati Purandeswari).
ఏపీ ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. కేంద్రం గనుక సహాయ సహకారం అందించక పోతే ఏపీ నడిచే పరిస్థితి లేదన్నారు బీజేపీ చీఫ్. ప్రధానంగా ప్రతిపక్షాలు, నేతలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేశారంటూ ఆరోపించారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎలా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు పురందేశ్వరి. ముందస్తు బెయిల్ తో సీఎం జగన్ , ఎంపీ విజయ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read : Priyanka Gandhi : మోసం బీజేపీ నైజం – ప్రియాంక