Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ బాధ్యతగా మాట్లాడాల్సిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా ఓ న్యూస్ ఛానల్ తో జరిగిన ఫేస్ టు ఫేస్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Comment about Old Andhra Pradesh
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పరిస్థితులు బాగుండేవని అన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నీళ్లు, నిధులు, నియామకాల గురించి కొట్లాడ లేదని చెప్పడం విస్తు పోయేలా చేసింది. సీమాంధ్ర పాలనలోనే అన్నీ ఇచ్చారని, ఆ పాలనే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అయితే తెలంగాణ అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. తాను గెలిస్తే సీఎం అవుతానని పదే పదే ప్రకటిస్తూ వచ్చిన టీపీసీసీ చీఫ్ ఉన్నట్టుండి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఒకింత పార్టీకి ఇబ్బంది కలిగిస్తూ వస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాల్సిన పార్టీ తన స్టాండ్ ను మార్చుకోవడం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. పోలింగ్ కు కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఇకనైనా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడితే బావుంటుంది.
Also Read : PM Modi : మాదిగలకు అండగా ఉంటా – మోదీ