Palvayi Sravanthi : పాల్వాయి స్రవంతి కంట తడి
పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉంది
Palvayi Sravanthi : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రముఖ సీనియర్ నేత, మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కన్నీటి పర్యంతం అయ్యారు. తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పరంగా తనకు సరైన సహకారం లభించ లేదన్నారు.
Palvayi Sravanthi Emotional
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా అవమాన పరిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బులున్న వాళ్లకే ప్రయారిటీ ఇచ్చారంటూ ఆరోపించారు పాల్వాయి స్రవంతి(Palvayi Sravanthi). ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ తరపున తను పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు.
బీజేపీలోకి జంప్ అయిన కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. ఈ తరుణంలో మూడో స్థానానికి పడి పోయింది స్రవంతి. మొత్తంగా తనకు స్థానం లేకుండా చేశారని ఆవేదన చెందారు. తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలో బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వెల్లడించారు స్రవంతి.
Also Read : Tammineni Veerabhadram : భట్టి ఓడి పోవడం ఖాయం