Varudu Kalyani : పురందేశ్వరిపై కళ్యాణి ఫైర్
సుదీర్ఘ లేఖ రాసిన ఎమ్మెల్సీ
Varudu Kalyani : విశాఖపట్నం – వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సీరియస్ అయ్యారు. బీజేపీ స్టేట్ చీఫ్ పురందేశ్వరిపై నిప్పులు చెరిగారు. పదే పదే మద్యం అమ్మకాలపై మీరు లేవదీస్తున్న ప్రజలు పార్టీ పరంగా చేసినవా లేక బాబు తరపు ఏమైనా చేశారా అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు వరుదు కళ్యాణి(Varudu Kalyani) సుదీర్ఘ లేఖ రాశారు.
Varudu Kalyani Serious Comments on Purandeswari
ఏదైనా ఆరోపణలు చేసినా లేదా విమర్శలు చేసినా దానికి ఓ ప్రామాణికత ఉండాలని, కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం పురందేశ్వరికి తగదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసినట్లు అర్థం అవుతోందన్నారు వరుదు కళ్యాణి.
తన మరిది చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేయడంతో తట్టుకోలేక పోతోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ. ప్రజలకు పూర్తిగా టీడీపీ పాలనలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసన్నారు. అందుకే నామ రూపాలు లేకుండా ఓడించారని ఎద్దేవా చేశారు.
43,000 బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలో వీధి వీధిలో మద్యం దుకాణాల్ని పాడుకున్న వారు దుకాణాలతో పాటు నడిపిన పర్మిట్ రూమ్లు, ఆ పైన బెల్ట్ షాపులు.. చేజిక్కించుకున్నది మీ బాబు హయాంలోనేనన్న సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. విషయం తెలుసుకోకుండా నోరు పారేసుకోవద్దని సూచించారు.
Also Read : YS Sharmila : కేసీఆర్ అఫిడవిట్ షర్మిల సెటైర్