Guvvala Balaraju : అంతం చేసేందుకే దాడి చేశారు
అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు
Guvvala Balaraju : ప్రభుత్వ విప్ , అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్ చేశారు. తనపై కావాలని కాంగ్రెస్ దాడికి పాల్పడిందంటూ ఆరోపించారు. ప్రజల కోసం తాను పని చేస్తున్నానని, తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వ లేకనే దాడులకు దిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కారును వెంబడించి మరీ తనను వెంబడించారని విమర్శించారు.
Guvvala Balaraju Comment
అచ్చంపేట ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు గువ్వల బాలరాజు. నాపై , నా అనుచరులపై అందరూ చూస్తూ ఉండగానే దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. నాపై ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తను పాల్గొంటూ తన అనుచరులతో వెంబడించారని మండిపడ్డారు. అయినా తాను బెదిరే ప్రసక్తి లేదన్నారు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలే ఊపిరిగా బతుకుతానని స్పష్టం చేశారు గువ్వల బాలరాజు(Guvvala Balaraju). వలస కూలీని అయిన తనను, తన పట్టుదలను, ప్రజల పట్ల తనకు ఉన్న ప్రేమను, సేవ చేసే భాగ్యాన్ని గుర్తించి తనను గెలిపించారని చెప్పారు. దాడికి గురైన బాలరాజు ఇవాళ మీడియాతో మాట్లాడారు.
పగ, ప్రతీకారం తమ సంస్కృతి కాదన్నారు. తనను అంతం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చావడానికైనా సిద్దంగా ఉన్నానని తాను వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.
Also Read : Congress Slams : గువ్వల బాలరాజు ఓ గూండా