Eatala Rajender : తెలంగాణలో మార్పు రావడం ఖాయమని, నిన్నటి దాకా తనకు ఎదురే లేదని విర్రవీగిన సీఎం కేసీఆర్ కు ఓటమి తప్పదని అన్నారు మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇటు హుజూరాబాద్ లో అటు గజ్వేల్ లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తనను గెలిపించడం ఖాయమని జోష్యం చెప్పారు.
Eatala Rajender COmments on KCR
నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ పేరుతో కోరి కొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసం తరతరాలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్(Eatala Rajender). అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగులను నిట్ట నిలువునా ముంచిన ఘనడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జవాబుదారీతనం లేకుండా పోయిందన్నారు ఈటల రాజేందర్.
ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ చేసిన మోసాన్ని గుర్తించారని , ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.
Also Read : Kumara Swamy : టెంపరరీ సీఎం సిద్దరామయ్య