Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మహమ్మద్ అజహరుద్దీన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
Revanth Reddy Challenge
దమ్ముంటే తాను చేసిన సవాల్ ను స్వీకరించాలని, ఖురాన్ తో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో కేసీఆర్ కు బేషరతు మద్దతు పలుకుతున్నారని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
తమ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం ముస్లిం సమాజాన్ని ఎలా మోసం చేస్తారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). పీఎం మోదీ, సీఎం కేసీఆర్ లాంటి మోసగాళ్లకు ఓవైసీ సపోర్ట్ చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షా సన్నిహితుడికి ఓవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు.
పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేసేందుకు ఓవైసీ సిద్దమేనా అన్నారు. మక్కా మసీదుకు తాను వస్తానని నువ్వు కూడా రావాలని అన్నారు. శుక్రవారం తాను వస్తానని మరి ఇంకెందుకు ఆలశ్యం అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓ పనికి మాలినోడంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.
తమంతకు తాముగా దాడులు చేయించుకుని సానుభూతి పొందేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read : Vijayashanti : ప్రాంతేతర పార్టీలను ఆమోదించరు