Bandaru Satyanarayana : బండారు దావాపై విచారణ వాయిదా
నవంబర్ 27కు పొడిగించిన హైకోర్టు
Bandaru Satyanarayana : అమరావతి – మాజీ మంత్రి బండారు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ కొనసాగింది. ఏపీ హైకోర్టులో తనను అక్రమంగా పోలీసులు నిర్బంధించారని ఆరోపిస్తూ దావా దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోర్టు ఈ సందర్బంగా ఆదేశించింది. ఇందుకు గాను తమకు కొంత సమయం కావాలని కోరారు పోలీసులు.
Bandaru Satyanarayana Case Postponed
దీంతో బండారు దాఖలు చేసిన కేసును ఈనెల 27కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి(TDP) చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కేబినెట్ లో కొలువు తీరిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆమె క్యారెక్టర్ ను కించ పరిచేలాగా మాట్లాడారు. దీంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక మాజీ మంత్రిగా పని చేసిన బండారు సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఆర్కే రోజా సెల్వమణికి అండగా నిలిచారు నటీమణులు . రాధికా శరత్ కుమార్, మీనా, ఖుష్బూ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కఠినంగా శిక్షించాలని కోరారు.
మొత్తంగా మాజీ మంత్రి ఈ రకంగా ప్రచారం పొందడం విశేషం. ఆయనను అరెస్ట్ చేయడంతో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
Also Read : Akunuri Murali : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టండి