Revanth Reddy : కేసీఆర్ దుకాణం బంద్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : కామారెడ్డి – రాష్ట్రంలో కేసీఆర్ పనై పోయిందని , ఇక మూట ముల్లె సర్దుకోవడం మాత్రమే మిగిలి ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం తాను పోటీ చేస్తున్న కామారెడ్డిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని , కల్వకుంట్ల కుటుంబాన్ని తన్ని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Revanth Reddy Comments on KCR
ప్రజలు పూర్తి స్థాయిలో డిసైడ్ అయ్యారని , బీఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు రెడీగా ఉన్నారని అన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కాళేశ్వరం పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డారని దీనిపై తాము వచ్చాక విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాలలో కనీసం తమకు 75 నుంచి 80 సీట్లు రావడం ఖాయమని జోష్యం చెప్పారు .
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తమ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు.
ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చర్యలు తీసుకోలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చిన తెలంగాణను సర్వ నాశనం చేసిన ఘనుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.
Also Read : Akunuri Murali : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టండి